High Court has made Sensational Comments on Ap Government | Oneindia Telugu

2017-12-07 958

High Court has made Sensational Comments Over the ap government administration

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన గురించి హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ఎపి ముఖ్యమంత్రి పెట్టుబడులే లక్ష్యంగా పర్యటనలు జరుపుతున్న నేపథ్యంలో హై కోర్టు వ్యాఖ్యలు ఎపి గవర్నమెంట్ ప్రతిష్టకు పెద్ద దెబ్బే. అంతే కాదు హైకోర్టు వ్యాఖ్యలను ఎపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దిద్దుబాటు చర్యలను యుధ్ద ప్రాతిపదికన మొదలుపెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇంతకీ అసలు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను ఏమంది? ఏ విషయంలో వ్యాఖ్యలు చేసింది? ఆ వివరాలు తెలుసుకుందాం..
ఏపీలో పరిపాలన మొత్తం గందరగోళంగా తయారైందని హైకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నుంచి వరుసగా తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే అక్కడి పరిస్థితులు ఏంటో అర్థమవుతోందని న్యాయమూర్తి అన్నారు. ఎపిలో పరిపాలనపై హైకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పాలన చూస్తుంటే గుండె దహించుకుపోతోందని జస్టిస్ రామచంద్రరావు ఆవేదన చెందారు. ఏపీలో పాలన ఒక పద్దతి, పాడు లేకుండా తయారైందన్నారు.